ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు : యాదాద్రి కలెక్టర్
యాదాద్రి భువనగిరి, 21 అక్టోబర్ (హి.స.) రైతులు తమ పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని మాందా
యాదాద్రి కలెక్టర్


యాదాద్రి భువనగిరి, 21 అక్టోబర్ (హి.స.)

రైతులు తమ పండించిన ధాన్యాన్ని

మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని మాందాపురం, నాతాళ్ల గూడెం, రెడ్ల రేపాక గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ ఉండేలా తాలు, మట్టి లేకుండా చూసుకోవాలని ఏఈవోలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మిల్లర్లు ఇబ్బంది పెట్టారని అన్నారు.

రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలైన టెంట్, వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. రానున్న రోజులలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు నిర్మించేందుకై ప్రభుత్వానికి సిఫారసులు పంపించడం జరిగిందని, జిల్లాలో 98 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande