అమరాతవి, 21 అక్టోబర్ (హి.స.) ఏపీ కేబినెట్ నవంబర్ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లుపై మంత్రి వర్గ ఉప సంఘం నియామకమైన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రేపటి కేబినెట్ సమావేశంలో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV