
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) : ఢిల్లీలో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం కొనసాగుతోంది. దీపావళి తర్వాత రోజురోజుకీ గాలి నాణ్యత పడిపోతోంది. తాజాగా ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ప్రమాదకర స్థాయికి 429 పాయింట్లకు కాలుష్యం చేరింది. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక, కాలుష్య కారక గాలి పీల్చడం వల్ల ఢిల్లీలో సగటున ప్రతి మనిషి రోజుకి 9 సిగరెట్లు తాగినట్లు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి 63 సిగరెట్లు, నెలకి 270 సిగరెట్లు తాగుతున్నట్లు వెల్లడించారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా తారాస్థాయికి వాయు కాలుష్యం చేరి దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయింది. గాలి పీల్చుకునేందుకు ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బయట తిరగవద్దని వైద్యుల సూచనలు చేశారు. ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కాగా, దీపావళి, పంట వ్యర్థాలు కాల్చివేత వల్ల వాయు కాలుష్యం భారీగా పెరిగింది.
దిలా ఉండగా.. ఢిల్లీని చుట్టుముట్టిన వాయు కాలుష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ డిమాండ్ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ