దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) . ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆశావాదం మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస
దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆశావాదం మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తారనే వార్తలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను పెంచాయి.

ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 368.97 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 84,977.13 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.7 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 26,053.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande