సరిహద్దుల నిర్వహణపై భారత్-చైనా చర్చలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}/ఢిల్లీ,29 అక్టోబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-
సరిహద్దుల నిర్వహణపై భారత్-చైనా చర్చలు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}/ఢిల్లీ,29 అక్టోబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

భారత్‌- చైనా (India- China) సంబంధాలు ఇటీవల బలపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దుల నిర్వహణపై తాజాగా ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. చైనా రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగినట్లు తెలిపింది. సైనిక, దౌత్య మార్గాల్లో లోతైన చర్చలు జరిపేందుకు ఇరువైపులా అంగీకారం లభించిందని చైనా వెల్లడించింది. భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని పేర్కొంది. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అక్టోబరు 25న చుషుల్‌- మోల్డో సరిహద్దు ప్రాంతంలో ఈ చర్చలు జరిగాయని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి స్నేహపూర్వకంగా జరిగాయని వెల్లడించింది. సరిహద్దుల్లో సమస్యల పరిష్కారం, స్థిరీకరణ తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande