
విశాఖపట్నం’, 23 అక్టోబర్ (హి.స.)విశాఖపట్నం’ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. గూగుల్ సంస్థ రూ.1.36 లక్షల కోట్లతో హైపర్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో విశాఖపట్నం ఎక్కడుందో ప్రపంచ వ్యాప్తంగా వెదుకుతున్నారు. అయితే... అంతకంటే ముందే అగ్ర దేశాలు విశాఖను ‘ప్రపంచ వ్యూహాత్మక రక్షణ కేంద్రం’గా గుర్తించాయి. అమెరికా, చైనా శాటిలైట్లు విశాఖను నిఘా కళ్లతో నిత్యం పరిశీలిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దశలవారీగా ఏర్పాటు చేస్తున్న సంస్థలే దీనికి కారణం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ