
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
నరసరావుపేటలోని పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. శివారు కాలనీల్లోకి భారీగా వరద చేరింది. పట్టణంలోని స్టేడియం వద్ద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో సత్తెనపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నగుంట, సుందరయ్య కాలనీ ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, భావనా రుషినగర్, రూత్ డైకెమేన్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్ల చుట్టూ వరదనీరు ఉండటంతో బయటకు రాలేక ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ