
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
: తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని గురజాల పట్టణంలో వరద ఉద్ధృతికి రోడ్లు జలమయం అయ్యాయి. గురజాల - జంగేశ్వరం మధ్య రైల్వే ట్రాక్ వద్ద బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలో నీట మునిగిన అరుంధతి కాలనీ, రజక కాలనీలను ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. నిర్మల పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచలను చేశారు.
వెల్దుర్తి మండల పరిధిలోని హనుమాన్ పురం తండాలో వాగు అవతల చిక్కుకున్న వారిని క్రేన్ సహాయంతో తరలించడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ సిబ్బంది
వెల్దుర్తి మండల పరిధిలోని గుడిపాటి చెరువులో వాగు పొంగి ప్రవహించడం వల్ల మాచర్లకు రాకపోకలు నిలిచిపోయాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ