
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం తమిళనాడు తీరం నుంచి అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. వాయువ్య దిశగా కదిలి మరికొన్నిగంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 23) చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు అంగన్వాడి కేంద్రాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు ప్రకటించారు. ఈ రోజు అల్పపీడనం ప్రభావంతో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని పాఠశాలలకు సెలవు ఇస్తున్నామని, విద్యార్ధులు, టీచర్లు ఎవ్వరూ పాఠశాలలకు రావొద్దని తన ప్రకటనలో తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా అధికారులు పాఠశాలల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాల్లోనూ అల్పపీడన ప్రభావంతో వర్షం దంచికొడుతుంది. తెల్లవారు జామున నుంచి బాపట్ల, నిజాంపట్నం, రేపల్లే ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ని
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV