పోలీస్ సేవల పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి, 23 అక్టోబర్ (హి.స.) పోలీస్ సేవలు వారి త్యాగాల పై విద్యార్థులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే అవగాహన కల్పించారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా గురువారం భూపాలపల్లి లో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించార
జయశంకర్ ఎస్పీ


జయశంకర్ భూపాలపల్లి, 23 అక్టోబర్ (హి.స.)

పోలీస్ సేవలు వారి త్యాగాల పై

విద్యార్థులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే అవగాహన కల్పించారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా గురువారం భూపాలపల్లి లో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల సేవలు, త్యాగాలు విద్యార్థులకు స్ఫూర్తి సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 7 పాఠశాలల నుండి సుమారు 500 మంది విద్యార్థినీ-విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసు అధికారులు వారికి పోలీస్ విధులు, సైబర్ నేరాలు, గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నియమాలు, భరోసా, షీ టీమ్, సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్స్ విభాగం, డాగ్ స్క్వాడ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande