ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యుల కృషి చేయాలి.. కలెక్టర్ సంతోష్
జోగులాంబ గద్వాల, 23 అక్టోబర్ (హి.స.) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యుల కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బి ఎం సంతోష్
జోగులాంబ కలెక్టర్


జోగులాంబ గద్వాల, 23 అక్టోబర్ (హి.స.)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల

సంఖ్య పెంచేందుకు వైద్యుల కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బి ఎం సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఓపీ, ఐపి రోగుల వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రసవాల సంఖ్యను పెంచాలని వంద శాంతం సాధారణ ప్రసవాలు చేయాలన్నారు.

గర్భిణుల ఆంటీనెంటల్ (ANC)కేర్ నమోదు ఖచ్చితంగా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించి, అవసరమైన ఐరన్,కాల్షియం టాబ్లెట్లు సమయానికి అందించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన అన్ని టాబ్లెట్లు ఉండాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande