
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో మంత్రుల మధ్య విబేధాలతో ఐఏఎస్ ఆఫీసర్లు పరేషాన్ అవుతూ నలిగిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని కామెంట్ చేశారు. మంత్రి జూపల్లి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని ఆరోపించారు. మంత్రుల విభేదాలతో ప్రభుత్వంలో భాగస్వాములైన ఐఏఎస్ లు పరేషాన్ అవుతున్నారని.. నలిగిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో మిగిలిన అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మంత్రుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే.. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుదని అన్నారు. తాజాగా అవినీతికి పాల్పడిన ఒక ఓఎన్డీని స్వయంగా మంత్రి కొండా సురేఖ తన కారులో తీసుకెళ్లి ఇంటికి అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి రక్షించారని ఆరోపించారు. సెటిల్మెంట్లు చేయమని సీఎం రేవంత్ రెడ్డే తుపాకీ ఇచ్చాడంటూ మంత్రి కుమార్తె చెబుతోందని.. ఇంత కంటే సాక్ష్యం ఇంకేం కావాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..