జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు: కామారెడ్డి జిల్లా కలెక్టర్
కామారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్ ను సందర్శించి పరిశీలించారు. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ( సీవోఎస్)లో గల పాత
కామారెడ్డి కలెక్టర్


కామారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.)

కామారెడ్డి జిల్లాలో సైన్స్ మ్యూజియం

ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్ ను సందర్శించి పరిశీలించారు. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ( సీవోఎస్)లో గల పాత ఇంజనీరింగ్ కాలేజీ లో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఏర్పాట్లను పర్యవేక్షించి అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు, టాయిలెట్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు పూర్తిగా తొలగించాలని, అవసరమైన చోట ఫ్లోరింగ్ చేయించాలని, గదులు శుభ్రతతో పాటు, మరమ్మత్తులు చేయించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande