రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయిలోని రియాలిటీ సంస్థ .శోభా గ్రూప్
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.) :రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్‌ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌ పర్యటన ప్రారంభమైంది.
amaravti


అమరావతి, 23 అక్టోబర్ (హి.స.) :రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్‌ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌ పర్యటన ప్రారంభమైంది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా మంత్రులు, అధికారులతో కలిసి బుధవారం దుబాయ్‌ చేరుకున్న ఆయన.. తొలి రోజే పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా..శోభా గ్రూప్‌ చైర్మన్‌ రవి మీనన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. అమరావతిలో రూ.100 కోట్ల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తామని రవి మీనన్‌ వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరంగా నిర్మిస్తున్నామని, దాని నిర్మాణంలో శోభా గ్రూప్‌ కూడా భాగస్వామి కావాలని సీఎం కోరారు. గ్రీన్‌ ఎనర్జీకి ఏపీని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని... మౌలిక సదుపాయాల కల్పనపైనా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ సహా రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయంటూ మీనన్‌ను ఆహ్వానించారు. శోభా గ్రూప్‌ తమ ఆదాయంలో 50 శాతాన్ని దానధర్మాలకు ఉపయోగించడాన్ని అభినందించారు. తాము ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. తమ సంస్థ దుబాయ్‌తోపాటు ఒమాన్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని.. భారత్‌లో 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టిందని రవి మీనన్‌ చెప్పారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలతో భేటీల్లో సీఎం ఆహ్వానించారు. విశాఖలో గూగుల్‌ పెట్టుబడులపైనా చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande