
సంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.)
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. అందోల్ నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మత్తుల పై సంగారెడ్డిలోని తననివాసంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రోడ్లు నిర్మాణ, మరమ్మత్తుల పనులు శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. గార్లపల్లి - అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో రోడ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. -
సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో విస్తరించి ఉన్న అందోల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్ శాఖ ఆద్వర్యంలో చేపట్టుతున్న రోడ్ల నిర్మాణ పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు