కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, 23 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క
నిజామాబాద్ కలెక్టర్


నిజామాబాద్, 23 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లాలోని

మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కేజీబీవీ స్కూల్ ను సందర్శించి, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజుల్లో మాంసాహారం, అరటి పండ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande