తొలి మహిళా ప్రెసిడెంట్‌గా.. ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత!
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత సాధించారు. కేరళలోని శబరిమల ఆలయంలో పూజలు చేసిన తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ముర్ము నిలిచారు. 1970లలో వివి గిరి తర్వాత శబరిమల ఆలయాన్ని సందర్శించిన రెండవ రాష్ట్రపతి ముర్మునే. రాష్ట్రపతి ద్
President Droupadi Murmu(File Photo)


ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత సాధించారు. కేరళలోని శబరిమల ఆలయంలో పూజలు చేసిన తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ముర్ము నిలిచారు. 1970లలో వివి గిరి తర్వాత శబరిమల ఆలయాన్ని సందర్శించిన రెండవ రాష్ట్రపతి ముర్మునే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో వచ్చిన ఆమె అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా పంబా నదిలో కాళ్లను శుభ్రం చేసుకుని.. పంపా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. గణపతి ఆలయం వద్ద ఇరుముడిని సిద్ధం చేసుకుని అయ్యప్ప సన్నిధానంకు చేరుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 18 బంగారు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి అయ్యప్పస్వామిని దర్శనం చేసుకున్నారు. చివరగా ప్రత్యేక అభిషేక పూజల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. రాష్ట్రపతి శబరిమల దర్శనంకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande