నేడు అల్పపీడనం బలహీన పడే అవకాశం
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం అంటే.. ఈ రోజు బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప
నేడు అల్పపీడనం బలహీన పడే అవకాశం


అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం అంటే.. ఈ రోజు బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. అలాగే మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. చెట్లు కింద నిలబడ వద్దని ప్రజలకు సూచించారు. భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande