ప్రజల రక్షణకే ప్రాధాన్యత : రామగుండం సీపీ
రామగుండం, 23 అక్టోబర్ (హి.స.) ప్రజల రక్షణకే పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ సందర్శించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమ
రామగుండం సిపి


రామగుండం, 23 అక్టోబర్ (హి.స.)

ప్రజల రక్షణకే పోలీస్ శాఖ అధిక

ప్రాధాన్యత ఇస్తోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ సందర్శించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలు, ప్రజల పరిరక్షణ, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. పోలీసు అమరవీరులు అందించిన స్ఫూర్తితో పోలీసులు ప్రజల రక్షణ, శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగాలని సూచించారు. అమరుల త్యాగాలు ప్రజల గుండెల్లో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande