చేవెళ్లలో రోడ్డు ప్రమాదం. గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతి
రంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీ కొనడంతో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం స్కూటీని
రోడ్డు ప్రమాదం


రంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీ

కొనడంతో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే స్కూటీ పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీకొట్టిన వాహనాన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande