
భూపాలపల్లి, 23 అక్టోబర్ (హి.స.)
పాఠశాలలో విద్యార్థినులతో
అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో పిల్లలను ఇబ్బంది పెడుతున్న ఓ ఉపాధ్యాయునికి భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు దేహశుద్ధి చేసిన ఘటన బుధవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. విద్యార్థి పరిషత్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు బుధవారం సాయంత్రం సదరు పాఠశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో పిల్లలను ఇబ్బంది పెడుతున్న ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..