ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. వెనుదిరిగిన అటవీశాఖ అధికారులు
ఆసిఫాబాద్, 23 అక్టోబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేసేందుకు గురువారం ఉదయం అధికారులు గ్రామానికి రాగా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని,
ఆసిఫాబాద్ జిల్లా


ఆసిఫాబాద్, 23 అక్టోబర్ (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేసేందుకు గురువారం ఉదయం అధికారులు గ్రామానికి రాగా ఆ భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, ముగ్గు వేయొద్దని అటవీ శాఖ అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు అధికారులు అటవీశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులంతా ఏకమవడంతో ఆందోళనకు దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తంగా మారడంతో అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande