హైదరాబాదు.మీదుగా మరో భారీ రైల్వే పొజెక్ట్ ప్రతిపాదన కు. దక్షిణ మధ్య రైల్వే సిద్ధం
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.) :ఆంధ్రప్రదేశ్‌ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం రాష్ట్రం గుండా వెళ్లే విధంగా రెండు హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లకు రూట్‌ మ్
హైదరాబాదు.మీదుగా మరో భారీ రైల్వే పొజెక్ట్ ప్రతిపాదన కు. దక్షిణ మధ్య రైల్వే సిద్ధం


అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)

:ఆంధ్రప్రదేశ్‌ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం రాష్ట్రం గుండా వెళ్లే విధంగా రెండు హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది.

ఎస్సీఆర్‌ ప్రతిపాదనల మేరకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ను 605 కిలోమీటర్లు, హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ను 760 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. రెండు కలిపి 1,365 కిలోమీటర్ల పొడవు గల హై స్పీడ్‌ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ రెండు కారిడార్లు 767 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు ఎస్సీఆర్‌ రూ.5.42 లక్షల కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు రూ.3.04 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు సంబంధించి ఏపీలో 263 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణం చేపడతారు. 6 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు సంబంధించి ఏపీలో 9 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 504 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రెండు కారిడార్లలో ముఖ్యమైన వర్కులు ఏపీలోనే జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande