
శబరిమల 23 అక్టోబర్ (హి.స.) ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 2019లోనే ఆలయంలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలుండగా.. ఆ సమయంలోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆయనను సస్పెండ్ చేసింది. సిట్ ఆయనను అదుపులోకి తీసుకొని తిరువనంతపురంలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బంగారం ఫ్రాడ్ కేసులో సిట్ రెండు వేర్వేరు ఎఫ్ఎఆర్లు నమోదు చేసింది. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్తో పాటు పది మందిని నిందితులుగా పేర్కొంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు