
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
వరుసగా వస్తున్న వ్యతిరేకత
కారణంగా సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎన్నో ఎళ్లుగా కొనసాగుతున్న కఫాలా వ్యవస్థ (Kafala System)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్ సహా ఇతర దేశాల నుంచి సౌదీకి వెళ్లిన వలస కార్మికులకు (Migrant workers) భారీ ఊరట దక్కింది. కఫాలా అంటే వలస కార్మికులపై యజమానికి హక్కులు కల్పిస్తుంది. దీంతో కఫాలాను అడ్డుపెట్టుకుని పని కోసం వచ్చిన కార్మికులను యజమానులు ఇంతకాలం చిత్ర హింసలు పెడుతూ వచ్చారు.
దీంతో కఫాలాపై కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు ఈ వ్యవస్థపై అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కఫాలాను రద్దు చేయాలని సౌదీపై అనేక రకాలుగా భారత ప్రభుత్వ ఒత్తిడి తెచ్చింది. దీంతో పరిగణనలోకి తీసుకున్న సౌదీ ప్రిన్స్ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సౌదీ లో ఉన్న కార్మికులు, భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..