రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, 23 అక్టోబర్ (హి.స.) రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం వ
ఆది శ్రీనివాస్


రాజన్న సిరిసిల్ల, 23 అక్టోబర్ (హి.స.) రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం వరి, మక్కలు కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నే అని అలాంటి రైతు అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని అన్నారు. రైతన్నలు పండించిన వరి పంటకు ఏ రకం ధాన్యానికి 2389 మక్కలకు 2400 కనీస మద్దతు ధర లభిస్తుందని అన్నారు.

ఆనాడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కొనసాగతున్నాయని అన్నారు. రైతులు పండంచిన పంటను చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు అధిశగా చర్యలు తీసుకోవాలి కోరారు. ఎవరు కూడా దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande