ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఢిల్లీ, దానాపూర్కు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.) ఢిల్లీ, ప్రయాగ్రాజ్, వారణాసి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు చెప్పింది. ఈ నెల 28, నవంబర్ 2 త
స్పెషల్ రైళ్లు


హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)

ఢిల్లీ, ప్రయాగ్రాజ్, వారణాసి వెళ్లే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు చెప్పింది. ఈ నెల 28, నవంబర్ 2 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని.. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైళ్లను నడిపిస్తున్నట్లు చెప్పింది. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (07081) రైలు అక్టోబర్ 28, నవంబర్ 2 తేదీల్లో రాకపోకలు సాగిస్తుందని.. తిరిగి నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ (07082) రైలు అక్టోబర్ 30, నవంబర్ 4 తేదీల్లో రైలు నడుస్తుందని పేర్కొంది.

ఈ రైలు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాసిమ్, అకోలా, మల్హాపూర్, ఖండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలాపతి, భోపాల్, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, దౌల్హాపూర్, ఆగ్రా, మథు స్టేషన్లలో రైలు ఆగుతుందని చెప్పింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande