
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, ప్రభుత్వ విధానాల పట్ల అవగాహన కోసం విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ గతంలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగ దినోత్సవం... నవంబరు 26న అమరావతి అసెంబ్లీ హాలులోనే స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 మందిని ఎంపిక చేస్తారు. వారికి శిక్షణ ఇచ్చి అమరావతిలో ఒక రోజు అసెంబ్లీ నిర్వహిస్తారు. వివిధ అంశాలపై విద్యార్థులు ఎమ్మెల్యేల తరహాలో అసెంబ్లీలో చర్చిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ