
మెల్ బోర్న్, 23 అక్టోబర్ (హి.స.)
ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధి.. క్రీడలు, నైపుణ్య శిక్షణకు సహకారం అందించాలని ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర (Victoria state) టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కోరారు. మెల్ బోర్న్ లో ఆయనను మర్యాదపూర్వకంగా లోకేష్ కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని తెలపారు. గ్రేట్ ఓషన్ రోడ్ (Great Ocean Road) తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పర్యాటక (AP Tourism) శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పని చేయాలన్నారు. విక్టోరియా పోర్టు ఫిలిప్ బే (Port Phillipe Bay) ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీలోని తీరప్రాంత స్థితిస్థాపకతపై ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజం తరహా ప్రాజెక్టులపై కలిసి పని చేద్దామని స్వాగతించారు. విక్టోరియా మెల్‌బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో గ్లోబల్ ఈవెంట్ల నిర్వహణకు సహకారం అందించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV