
శ్రీకాకుళం, 23 అక్టోబర్ (హి.స.)పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో ప్రవేశించి అక్కడి నేవీ అధికారులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులను క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ విషయంపై బుధవారం రాత్రి విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులను తిరిగి రప్పించేందుకు బంగ్లాదేశ్ ఎంబసీ, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులు బుధవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని తిరిగి రప్పించేందుకు కేంద్రమంత్రి చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు