అటవీ విస్తీర్ణంలో భారత్‌కు తొమ్మిదో స్థానం
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొందని బుధవారం విడుదలైన గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికలో వెల్ల
Seoni: The fascinating dragonfly – Fulvous Forest Skimmer – has been spotted on the forest banks of Pench National Park.


ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొందని బుధవారం విడుదలైన గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికలో వెల్లడైంది. గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యాల తర్వాతి స్థానాన్ని భారత్‌ ఆక్రమించింది. దేశంలో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం 1,91,000హెక్టార్లు(0.27%) పెరిగింది. చైనాలో 0.77%, రష్యాలో 0.11% వృద్ధి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ పెద్దఎత్తున అడవుల పెంపకం, అటవీ సంరక్షణ ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ‘‘అటవీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భారత్‌ పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి రావడం ఓ పెద్ద విజయం. సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ సమతౌల్యానికి భారత్‌ కట్టుబడి ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం’’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.14 బిలియన్‌ హెక్టార్ల(32 శాతం) అటవీ ప్రాంతముందని నివేదికలో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande