
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)తమ హయాంలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్వ చ్చిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy) అన్నారు. విశాఖ గూగుల్ సెంటర్‌ను తామే తెచ్చామని టీడీపీ నేతలు చెప్పుకోవడంపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2023 మే3న విశాఖలో డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. సింగపూర్(Singpur) నుంచి సబ్ సీ కేబుల్‌కు అంకురార్పణ చేశామని తెలిపారు. ఇతరుల క్రెడిట్‌ను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకొట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. అదానీ డేటా సెంటర్ కు విస్తరణలో భాగమే గూగుల్ డేటా సెంటర్ అని వ్యాఖ్యానించారు. 2022 అక్టోబర్ లోనే అదానీ, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. అదానీ పేరును సీఎం చంద్రబాబు దాచిపెట్టారని విమర్శించారు. అదానీ కంపెనీలే ఇప్పుడు విశాఖలో డేటా సెంటర్ నిర్మిస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. గూగుట్ డేటా సెంటర్ క్రెడిట్ తమదంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV