
తిరపతి, 23 అక్టోబర్ (హి.స.) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని భూమన కరుణాకర్ కు నోటీసులను జారీ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపాలని కోరారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ పోలీసు విచారణకు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV