
తిరుమల, 23 అక్టోబర్ (హి.స.)శ్రీ వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రం తిరుమల పురాతన కట్టడాలకు పెట్టింది పేరు. ఇదే కోవలోకి 300 ఏళ్ల క్రిత నిర్మించిన అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం కూడా వస్తుంది. అయితే, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఆ మండపాన్ని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మండప పనరుద్ధరణ పనులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవలే పురావస్తు శాఖకు సైతం లేఖ రాసింది. తాజాగా, సర్కారు ప్రతిపాదనకు వారు అంగీకరించడంతో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో పూణేకు చెందిన ఓ దాత సహకారంతో శ్రీవారి పాదన మండప పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పునరుద్ధరణ పనులను పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి పర్యవేక్షించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV