
నెల్లూరు, 23 అక్టోబర్ (హి.స.) నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వద్దనున్న పెంచలకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడకు వచ్చే భక్తులతో పాటు పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఎత్తయిన కొండలు, పచ్చని చెట్ల మధ్య నుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతం విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే భారీ వర్షాల కారణంగా ప్రవాహం ఎక్కువ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతోంది.
నీటి ప్రవాహం పెరగడంతో వాటర్ ఫాల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారులు భద్రతా చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV