
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా.. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు (Bihar Assembly elections). కానీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం ఏకాభిప్రాయం కుదిరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తేజస్వీ యాదవ్ వైపే భాగస్వామ్య పార్టీలు మొగ్గుచూపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి (CM face Tejashwi Yadav). ఆయన నాయకత్వంలో ముందుకువెళ్లేందుకు అంగీకరించాయని తెలిపాయి. సీఎం అభ్యర్థి గురించి గురువారం సాయంత్రానికి అధికారిక ప్రకటన ఉండొచ్చని వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ