ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. ఆసిఫాబాద్ కలెక్టర్
ఆసిఫాబాద్, 24 అక్టోబర్ (హి.స.) ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, తెలంగాణ హెచ్ ఐవీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
ఆసిఫాబాద్ కలెక్టర్


ఆసిఫాబాద్, 24 అక్టోబర్ (హి.స.) ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, తెలంగాణ హెచ్ ఐవీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్. డీఎంహెచ్ వో సీతారాం. జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆసిఫాబాద్ జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని, ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హెచ్ ఐవీ వంటి లక్షణాలు ఉంటే వీలైనంత త్వరగా పరీక్షించుకొని సత్వర వైద్య సేవలు పొందాలని. జీవిత భాగస్వామికి కూడా పరీక్షలు చేయించాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande