
నల్గొండ, 24 అక్టోబర్ (హి.స.) దళారులకు పత్తిని అమ్మి
రైతులు మోసపోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిల్కమర్రి స్టేజి శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తేమ తక్కువ ఉండి, చెత్తాచెదారం లేని నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..