
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ ల నిర్మాణ వ్యయం రూ.1715 కోట్లు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ నిర్మాణ వ్యయాన్ని బీఆర్ఎస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిందని సర్కార్ ఆరోపించింది. తొలుత రూ.3779 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. మేరకు 2021లో జీవోలు సైతం జారీ చేశారు. రెండేళ్లలో నిర్మాణ వ్యయాన్ని రూ.6714 కోట్లకు కేసీఆర్ సర్కార్ పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. నిర్మాణ వ్యయం పెంపులో నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎంక్వైరీ కమిటీ గుర్తించింది. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు అడ్డగోలు నిర్మాణ వ్యయాన్ని పెంచినట్టు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..