విద్య రాని వ్యక్తి విద్యా శాఖ మంత్రి.. సీఎం రేవంత్ రెడ్డి పై హరీశ్రావు వ్యాఖ్యలు
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) విద్యా శాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రారావు తీవ్రంగా విమర్శించారు. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పా
హరీష్ రావు


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) విద్యా శాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రారావు తీవ్రంగా విమర్శించారు. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయిపోయిండు అని హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

జీవో 29, జీవో 55పై నేను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. భట్టి గారు దళిత మంత్రిగా ఉన్నారు మీరైనా పట్టించుకోండి అంటే పట్టించుకోలేదు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నరు. గల్లా పెట్టెలు నింపుకుంటున్నరు. విద్య రాని వ్యక్తి విద్య శాఖ మంత్రి. అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని హరీశ్రావు విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande