నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయ్.. హుజురాబాద్ ఏసీపీ మాధవి
హుజురాబాద్, 24 అక్టోబర్ (హి.స.) నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్ కార్యక్రమం శుక
ఏసీపీ మాధవి


హుజురాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థుల సహకారంతో రూ.లక్ష లతో ఏర్పాటు చేసిన 3 సోలార్ కెమెరాలు, 4 ఫిక్స్డ్ కెమెరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రారంభించారు.

ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలని కోరారు. అనంతరం సీసీ కెమెరాల దాతలు మ్యాక రమేష్, నల్ల తిరుపతిరెడ్డి, గెల్లు మల్లయ్య, శ్రీకాంత్, గెల్లు కొమురయ్య, వీరయ్య, మ్యాక సమ్మయ్యలతో పాటు పలువురు దాతలను ఏసీపీ మాధవి శాలువాలు కప్పి సన్మానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande