
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద
వోల్వో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ ను ఢీ కొట్టి బస్సు ముందుకు వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 12 మంది ఎమర్జెన్సీ విండో, బస్సు వెనక వైపు అద్దం పగలగొట్టి బయటకు దూకగా ప్రమాదంలో 20 మంది కి పైగా మరణించారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ప్రైవట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా చనిపోవడం తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు