కర్నూలు బస్ యాక్సిడెంట్.. పరిహారాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల వెలికితీత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
బస్సు ప్రమాదం


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల వెలికితీత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రూ.5 లక్షలు, అదేవిధంగా క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించినట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande