అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కాంగ్రెస్ రైతుల పక్షమే : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, 24 అక్టోబర్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ రైతుల పక్షమేనని, అన్నం పెట్టే రైతన్న నష్టపోవద్దన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట ప
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


షాద్నగర్, 24 అక్టోబర్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు

ఎప్పుడూ రైతుల పక్షమేనని, అన్నం పెట్టే రైతన్న నష్టపోవద్దన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేవిధంగా పని చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande