నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు.. మంత్రి సీతక్క
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని సీతక్క ప్రసంగించారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల
మంత్రి సీతక్క


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని సీతక్క ప్రసంగించారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని అన్నారు. మూడు పర్యాయాలు బీఆర్ఎస్ ను గెలిపించారు.. కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు.. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్లో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఒక అవకాశం నవీన్ యాదవ్కు ఇవ్వాలని కోరారు. మీరు నవీన్ యాదవ్ను ఆశీర్వదిస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తాయని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande