ఆస్ట్రేలియాలో విక్టోరియా పార్లమెంట్ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన విక్టోరియా పార్లమెంట్ను సందర్శించారు. శ్రీధర్ బాబుకు లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వా
శ్రీధర్ బాబు


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన విక్టోరియా పార్లమెంట్ను సందర్శించారు. శ్రీధర్ బాబుకు లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

వారికి శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్ ను వివరించారు. ట్రాన్స్పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande