
నల్గొండ, 24 అక్టోబర్ (హి.స.)
సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని కాటన్ మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు.
సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..