రౌడీ షీటర్లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సెలింగ్.. కీలక హెచ్చరిక.
నల్గొండ, 24 అక్టోబర్ (హి.స.) ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నల్గొండ ఎస్.పి


నల్గొండ, 24 అక్టోబర్ (హి.స.)

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మెలగాలన్నారు. జిల్లా పరిధిలో రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల నిఘాలో ఉన్నాయని, చట్ట వ్యతిరేక కార్యలాపాలు ఆర్థిక, భూ సెటిల్మెంట్లు వంటివి చేస్తూ సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైన చట్టం నుంచి తప్పించుకోలేరని, ఇప్పటికే పలువురికి శిక్షలు విధించడం జరిగిందన్నారు.

జిల్లాలో ప్రతి ఒక్కరి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) నమోదు చేయడానికి వెనుకాడబోమన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande