విద్యార్థుల కోసం సైబరాబాద్ కమిషనరేట్ లో ఓపెన్ హౌస్ నిర్వహణ
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగ ప్రజా భద్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ మహిళా, శిశు భద్రతా విభాగ
ఓపెన్ హౌస్


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగ ప్రజా భద్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ మహిళా, శిశు భద్రతా విభాగం డీసీపీ సృజన కర్ణం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువులపైనే కాకుండా సామాజిక సమస్యలపై, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి కూడా తెలుసుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది, ప్రజా భద్రత కోసం పోలీసులు ఎలా కృషి చేస్తారు అనే విషయాలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని డీసీపీ తెలిపారు.

సైబరాబాద్ పరిధిలోని ఐదు జోన్ల నుండి వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 550 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఓపెన్ హౌస్ లో బాంబ్ డిస్పోజల్ టీమ్ బాంబ్ సూట్, బాంబ్ బ్లాంకెట్, వెహికల్ సెర్చ్ మిర్రర్, వివిధ మెటల్ డిటెక్టర్లు వంటి బాంబుల గుర్తింపు, నిర్వీర్యం చేసే పరికరాలను ప్రదర్శించారు. స్నిఫర్ డాగ్స్ (వాసన పసిగట్టే శునకాలు) పేలుడు పదార్థాలను గుర్తించే తమ నైపుణ్యాలను ప్రదర్శించగా, బృందాలు ఎన్ ఎల్ జేడీ, ఎఫ్ ఓ ఎస్ ఎస్ వంటి అధునాతన సాధనాల వినియోగాన్ని పోలీసులు విద్యార్థులకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande