కర్పూరీ ఠాకూర్‌కు నివాళులు అర్పించి.. బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు (Bihar Assembly election). సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం
PM Modi


ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.)

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు (Bihar Assembly election). సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌ (Karpoori Thakur)కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను కలిశారు. ఈ సందర్భంగా రోజ్‌గార్‌మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘యువతకు సాధికారత కల్పించడమే మా కూటమి ప్రాధాన్యం. ఫెస్టివల్ సీజన్‌లో ఆఫర్ లెటర్స్ అందుకోవడం వేడుకలను రెట్టింపు చేస్తుంది. ఈ రోజు 51 వేల మంది యువత ఆ ఆనందాన్ని పొందుతున్నారు. అది నాకు ఆనందాన్నిస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన వారికి కృతజ్ఞతలు’’ అని మోదీ (PM Modi) అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande